Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మండలిలో ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ ఃపోచంపల్లిఃతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఃపోచంపల్లిఃని సీఎం అభినందించారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, డాక్టర్ బండా ప్రకాశ్, టి. రవీందర్రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.