Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్పీడీసీఎల్ ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీిఐ(ఎం), కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి హన్మకొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఛార్జీల పెంపుపై సోమవారం బహిరంగ విచారణ చేపట్టింది. మండలి చైర్మెన్ శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, క్రిష్ణయ్యలు విచారణ నిర్వహించారు. తొలుత ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ప్రతిపాదిత ఛార్జీల పెంపు ఆవశ్యత, కంపెనీ నష్టాలను వివరించారు. అనంతరం రాజకీయ పార్టీల నేతలు, రైతులు అభిప్రాయాలను తెలిపారు.
కేంద్ర విద్యుత్ చట్టాన్ని
ఉపసంహరించాలి : సారంపల్లి మల్లారెడ్డి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని, ఇందుకు కమిషన్ సిఫారసు చేయాలని ఎఐకెఎస్ ఆలిండియా ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టంతో మున్ముందు క్రాస్ సబ్సిడీలుండవని చెప్పారు. ఈ చట్టంతో ఫెడరల్గా రాష్ట్రాల జాబితాలో వున్న విద్యుత్ కేంద్ర జాబితాలోకి వెళ్లిపోతుందన్నారు. దీంతో ఉచిత విద్యుత్ ఇక ముందు వుండదన్నారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ కోరాలన్నారు. గత నాలుగేండ్లుగా ఇఆర్‌సి కార్యాచరణలో లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఇఆర్సిలు పనిచేయడం విచారకరమన్నారు. ఎన్పిడిసిఎల్ సిఎండి పెట్టిన ప్రతిపాదిత విద్యుత్ చార్జీల పెంపు అశాస్త్రీయంగా వుందన్నారు. ప్రతి కేటగిరీకి గుండు గుత్తాగా యూనిట్‌కు 0.50 పైసలు, యూనిట్‌కు రూపాయి పెంచాలని ప్రతిపాదిం చారని తెలిపారు. గృహ వినియోగదారులపైనే 30 శాతానికిపై ఛార్జీలు పెంచుతున్నారన్నారు. ఇది రాష్ట్రంలో 50 లక్షల మంంది వినియోగదారులపై భారం పడుతుందన్నారు. డెవలప్మెంట్ ఛార్జీల పేరిట వినియోగదారుల పై భారాలు మోపడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లాలోనే రూ.100 కోట్ల భారాన్ని వేశారని తెలిపారు. రూ.200 బిల్లు చెల్లించే వాళ్లకు డెవలప్మెంట్ ఛార్జీల మోతతో రూ.2 వేల నుండి రూ.5 వేల మేరకు బిల్లులు వేశారన్నారు. డెవలప్మెంట్ ఛార్జీలను