Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అయిలయ్య
నవతెలంగాణ-సుబేదారి
సమాజంలోని ప్రతిఒక్కరూ మాతృభాషను గౌరవించాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య కోరారు. హనుమకొండ సుబేదారిలోని ఆ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఆయా ప్రాంతాలను బట్టి భాషలు, సంస్కతి, సాంప్రదాయాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఆంగ్ల భాష ప్రభావంతో తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతోందని ఆందో ళన వెలిబుచ్చారు. భాషను పరిరక్షించుకోవా ల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్య క్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య హనుమంతు, తెలుగు విభాగం అధ్యాపకుడు డాక్టర్ వెంకటయ్య, తెలుగు విభాగ అధ్యక్షుడు డాక్టర్ మామిడి లింగయ్య, అధ్యాపకులు డాక్టర్ సదాశివ, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సాంస్కృతిక, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జయశ్రీ మాట్లాడారు.
వేలేరు : మండలంలోని పలు ప్రభుత్వ పాటశాలల్లో మాతృబాషా దినోత్సవం నిర్వ హించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం నాగకుమారి, కేజీబీవీలో ఎస్ఓ స్రవంతి ఆధ్వ ర్యంలో విద్యార్థులకు ఉపన్యాస, పద్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సర్పంచ్ కాయిత మాధవరెడ్డి, ఉపసర్పంచ్ సద్దామ్ హుసేన్, సీఆర్పీ మొగిలిచెర్ల శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యాయులు ఉమాదేవి, కుమారస్వామి, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : మండలంలోని బరిగలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాతభాషా దినోత్సవం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కొత్తపల్లి పోషన్న అధ్యక్షత వహించగా సర్పంచ్ గరిగ లత నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చిత్ర లేఖనం, కథల పోటీ లు నిర్వహించి సర్పంచ్ లత నర్సింగావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైన విద్యార్థులకు బహుమతులు అందించారు.