Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
కేంద్ర బడ్జెట్‌పై ఈనెల 25న నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల చక్రపాణి తెలిపారు. హనుమకొండలో గడ్డం అశోక్ అధ్యక్ష తన సోమవారం నిర్వహించిన యూనియన్ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా చక్రపాణి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక చట్టాలపై దాడి చేస్తోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి యజమానులకు కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్లపైగా కోత విధించారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించలేదని తెలిపారు. సంపన్నులకు అనుకూలంగా నిధులు కేటాయించారని చెప్పారు. నిరసనను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ మండల నాయకులు చంటి రవి, వెంకటస్వామి, యశోద, యాకూబ్, రంజిత్, ప్రకాష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.