Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే దఢసంకల్పంతో కేంద్ర ప్రభుత్వ పథకాల తో తయారుచేసిన క్యాలెండర్లను మండలంలోనీ నాగిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం బీజేపీ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప ఆవిష్క రించారు. మండల అధ్యక్షులు సద్ధి సోమిరెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివద్ధి సంక్షేమ పథకాలు అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నే జరుగుతు న్నాయన్నారు. సురక్ష భీమా, ప్రధానమంత్రి ముద్ర యోజన, ఈశ్రమ్ కార్డులు, రైతులకు కిసాన్ సమ్మాన్ పెట్టుబడి సహాయం, పల్లె ప్రకతి వనం, చెత్త సేకరణ డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, హరితహారం, వన నర్సరీ, నూతన పంచాయతీ భవనాలు, సర్పంచ్ ఖాతాలో నిధులు జమ చేయడం లాంటివి కేంద్రమే అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు బంగారు మహేష్ బూత్ అధ్యక్షులు అశోక్, అనిల్, సోషల్ మీడియా మండల కన్వీనర్ తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.