Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడకండ్ల
ప్రజల సౌకర్యార్థం ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.16 లక్షలతో చేపట్టే ఆరోగ్య ఉపకేంద్రానికి సోమవారం మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామంలో వరంగల్ డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి సహకారంతో ఉప కేంద్రం నిర్మించడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సత్యమ్మ ఎంపీపీ జ్యోతి, మండల అధ్యక్షుడు రామోజీ, లక్ష్మక్కపల్లి సర్పంచ్ శోభారాణి, ఎంపీటీసీ రామ్‌కోటి, గ్రామ అధ్యక్షుడు కాటూరి కష్ణమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.