Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మాతభాషపై వివక్ష చూపకుండా గౌరవించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి భైరవపాక నవీన సూచించారు. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల గురుకుల పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ పర భాష పై జ్ఞానాన్ని పెంపొం దించుకోవాలన్నారు. కానీ మాత భాషపై చిన్నచూపు చూడొద్దని తెలిపారు. ప్రతి ఒక్కరు మాతభాష తోనే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శైలజ, సుప్రియ, అశ్లేష,హైమావతి, సంధ్య, నిర్మల, విజయ, వాణి శ్రీ, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.