Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలు సబ్ క యోజన సబ్ క వికాస్ వాటర్ షెడ్నిర్మాణాలకు ఎంపికైనట్లు మండల అధికారి సురేందర్ తెలిపారు. సోమవారం మండలంలోని కొడవటంచా గుడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. డీఆర్డీఓ పురుషోత్తం హాజరై మాట్లాడారు. రేగొండ మండలం లోని 8 గ్రామ పంచాయతీలు బాగిర్తిపేట, కొత్తపల్లి, నారాయణపూర్, కొడవటంచ, పొనగండ్ల, మడ్తపల్లి, గుడెపల్లి, దుంపిల్లపల్లి గ్రామాలు ఎంపికయ్యాయని తెలిపారు. కొత్తపల్లి, గుడెపల్లి,కొడవటంచ పొనగండ్ల గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి మౌలిక సదుపాయాలు, తదితరవి సేకరి స్తారన్నారు. ఈ పథకం కింద అంగన్వాడీ సెంటర్లలో ప్రభుత్వ పాఠశా లల్లో విద్యుత్ సౌకర్యం లేనిచోట సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తా రన్నారు. చెక్‌డ్యాంలు నిర్మిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, గంపల సుమలత భాస్కర్, ప్రసాదరావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.