Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచర్లలోని ఓసీపీిని టీఎస్ జెన్కో అధికారుల బందం సోమవారం పరిశీలించి తనిఖీ చేసింది. టీస్ రీజనల్ కోల్ కంట్రోలర్ డివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని బందం 2021-22 సంవత్సరానికి గాను జెన్కో అధికారులు కోల్ గ్రేడ్ నిర్థారిత పరిక్షలను నిర్వహించారు. జెన్కో డైరెక్టర్ రీజనల్ ఫ్యూయల్ కమర్షియల్ అధికారి టిఆర్కె రావు, టీఎన్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు తాడిచర్ల ఓసిపిని తనిఖీ చేశారు. ఓపెన్ కాస్ట్ ఆవరణలోని ప్లాంటేషన్, మానేరు సమీపంలో ఎంబ్యాక్ మెంట్ సైట్ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో అధికారులు ఎస్ఈ వసంతకుమార్, డిఈ అజీజ్, పాషా, ఏడీఈ గణేష్, టీడీసీ ఏఈ రాజేష్, తాడిచర్ల ఏఎమ్మార్ ప్రాజెక్టు డిప్యూటీ హెడ్ చంద్రమౌళి, మైన్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి, సురేష్ బాబు, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.