Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సమిష్టి పొదుపులతోనే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చని దుగ్గొండి పొదుపు సమితి అధ్యక్షులు అన్నారు. మండలం లోని చంద్రయ్యపల్లి గ్రామంలో చంద్ర పురుషుల పొదుపు సంఘం 16వ వార్షిక మహాసభ సంఘం అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ పాల్గొని మాట్లాడారు. సంఘాన్ని పటిష్టవం తంగా కొనసాగించడం అభినందనీ యమన్నారు. అనంతరం సంఘం వ్యవస్థాపకులు కుమారస్వామి, సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు. మొత్తం గా రూ.34.20 లక్షలు రుణ సహాయం చేసినట్టు తెలిపారు. అనంతరం నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కందుల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బానోతు రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బానోతు రమేష్, పాలకవర్గ సభ్యులు వడ్డేపల్లి మృత్యుంజయుడు, భాష బోయిన రాజు, పాక రాజయ్య, సలపాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.