Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ వ్యవహరించిన తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో జాతర గౌరవ అధ్యక్షుడు కత్తుల కట్టయ్య, సీపీఎం నాయకులు, ఇప్పగూడెం ఎంపీటీసీ గండి విజయలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జులుకుంట్ల శిరీష్‌రెడ్డి, సీపీఐ(ఎం) ఏరియా కార్యదర్శి మునిగెల రమేష్, టీిఆర్‌ఎస్ మండల నాయకులు పల్లె రవీందర్, బీజేపీ జిల్లా నాయకులు మందపురం సతీష్ మాట్లాడారు. కోమటిగూడెం, రంగరాయి గూడెం, అక్కపల్లిగూడెం, బోయినిగూడెం, ఇప్పగూడెం గ్రామాల సంయు క్తంగా నిర్వహించిన చింతగట్టు జాతరలో ప్రారంభ దశ నుండే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఓవర్గం నియంతత్వంగా ఎమ్మెల్యే రాజయ్య ప్రోద్బలంతో ఏకపక్షంగా సింగల్ ట్రస్ట్ చైర్మన్‌ను నియమించుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. నాలుగు గ్రామాల ప్రజలను ప్రజాప్రతినిధులను కులసంఘాల పెద్దలను సంప్రదించలేదన్నారు. సింగల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ని కను సవాలుచేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో హైకోర్టు వెళ్లగా, చైర్మన్ ఎన్నిక సరికాదని కోర్టు స్టే విధించిందన్నారు. జాతరకు రెండు రోజుల ముందు వచ్చినా కూడా ఎండోమెంట్ శాఖ అధికారులు పట్టించుకోకుండా చైర్మన్‌ను ముందు పెట్టి పనులు సాగిస్తూ కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు కారణమైన ఈవో లక్ష్మీ ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతర హుండీ లెక్కింపులో కూడా అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చొప్పరి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గొడుగు రాజు, మొదుంపల్లి కుమార్, బీజేపీ గ్రామ కార్యదర్శి సట్ల రమణ, సీపీఐ(ఎం) నాయకులు మంద మహేందర్, పొలసు పరమేష్, కిష్టయ్య, పర్ష కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.