Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రాష్ట్ర యువనేత, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి
నవతెలంగాణ-లింగాలఘనపురం
రాజకీయంగా జన్మనిచ్చిన ఈ ప్రాంతాన్ని మర్చిపోనని, తన జీవితం ప్రజాసేవకే అంకింతమని టీఆర్ఎస్ రాష్ట్ర యువనేత, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు యువ నాయకులు కార్యకర్తలు, ప్రజలు జెడ్పీటీసీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయక త్వంలో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.