Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
వీఆర్ఏల సమస్యలు పరిష్క రించాలని వీఆర్ఏల సంఘం మండలం నాయచకులు కోరారు. సోమవారం స్థానిక తహసీల్ధార్ సతీష్‌కుమార్‌కు వారు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రెవెన్యూ సహాయకుల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే శాంతి యాత్ర మహా ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమ్మలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి18 నెలలు గడిచినా అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు సమ్మయ్య, అశోక్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.