Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడిగా పేరుపొంది తెలంగాణగాంధీగా గుర్తింపు తెచ్చుకున్న మహానీ యుడు భూపతి కష్ణమూర్తి అని ఏసీపీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండా ప్రభాకర్ గుప్తా, బీజేపీ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ సతీష్ అన్నారు. భూపతి కష్ణమూర్తి 96వ జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు భూపతి కష్ణమూర్తి ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పిరిష్కారానికి పోరా డాలన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి సభ్యులు చందా జగదీశ్వర్, దివ్వెల పూర్ణచందర్, గుండ సంతోష్ కుమార్, నాగరాజు, విశ్వేశ్వరరావు, రమేష్, ప్రవీణ్ పాల్గొన్నారు