Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందర్శకులకు ఇబ్బందులు తలెత్తొద్దు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
కాళేశ్వరంలో శివరాత్రి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. మహాదేవపూర్ నుండి గోదావరి బ్రిడ్జి వరకు రోడ్డు మరమ్మతులు నేషనల్ హైవే అధికా రులు, వీఐపీ ఘాట్ రోడ్, కాళేశ్వరం గ్రామంలో అంతర్గత రహదారుల మరమ్మతు పనులను పంచా యతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, పల్గుల వైపు రోడ్డు మరమ్మతు పనులను ఆర్‌అండ్‌బీశాఖ చేపట్టి ఐదురోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. జాతర జరిగే ప్రాంతంలో పారిశుధ్యం, వాహనాల పార్కింగ్ తోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా షవర్ బాత్, సందర్శకులు గోదావరి నది లోతట్టు ప్రాంతా నికి వెళ్లకుండా జాలి, తాత్కాలిక డ్రెస్సింగ్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోలింగ్రూమ్, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక పీహెచ్సీ పరిధిలో 108 అంబులన్స్‌లను అందుబాటులో ఉంచాల న్నారు. తాగునీటి ఏర్పాట్లతోపాటు, శాశ్వత మరుగు దొడ్ల మరమ్మతులు, అదనంగా 60 మరుగుదొడ్లను ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ ప్రాంతాలు, పుష్కరఘాట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... రాజకీయాలకఅతీతంగా ప్రోటోకాల్ ప్రకారం పట్టు వస్త్రాల సమర్పణ తదితర పూజా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. స్థానిక ప్రజలకు, వ్యాపారులకు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీఐపీ, గెస్ట్‌హౌస్‌లను మరమ్మతులు చేయాలన్నారు. జాతర విజయవంతా నికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం శివరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎంపీపీ రాణిభాయి, జెడ్పీటీసీ అరుణ, డీపీఓ ఆశాలత, డీఎం హెచ్ఓ శ్రీరామ్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటే శ్వర్లు, డీపీఆర్ఓ రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధి కారి అవినాష్, ఇరిగేషన్ డీఈ తిరుపతిరావు, విద్యు త్‌శాఖ డీఈ నాగరాజు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిం టెండెంట్ తిరుపతి, మహాదేవపూర్ తాసిల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.