Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్వప్న దంపతుల పెండ్లీ రోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై పలురకాల మొక్కల కుండీిలు బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పెండ్లీ రోజు కేక్ కట్ చేసి సంబురాలను పంచుకున్నారు. క్యాంప్ ఆవరణంలో ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి పెద్ది దంపతులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ నాయకులు కళ్లెపెల్లి సురేష్, కొడారి రవి, జేరిపోతుల వెంకటేశ్వర్లు, ఈదునూరి యాకయ్య, నమిండ్ల సురేష్, మాదాసి కుమారస్వామి, నాగెల్లి ప్రకాష్, ప్రవీణ్, పరికి నవీన్, నాగరాజు, సందీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వప్న దంపతులకు పెండ్లీ రోజు శుభాకాంక్షల వెల్లువెత్తాయి. ఏసీపీ సీహెచ్.ఫణీంద్ర, సీఐ పులి రమేష్, రూరల్ సీఐ సూర్య ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ నల్లా మనోహర్ రెడ్డి, ఎంపీపీ మోతె కలమ్మ, బాధవత్ వీరేందర్, వేములపెల్లి ప్రకాశ్‌రావు, వివిధ మండల నాయకులు మొక్కల కుండిలను, పుష్ఫ గుచ్ఛాలను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.