Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
గ్రామాల్లో పోస్టాఫీసు సేవ లను వినియోగించుకోవాలని ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్రిష్ణా నగర్లో పోస్టాఫీసును వారు ప్రారంభించి మాట్లాడారు. తపాల సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ కొడారి మోహన్ యాదవ్, ఎంపీటీసీ బొమ్మ పావని యుగంధర్, ఉపసర్పంచ్ కవిత ఓదెలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.