Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రఘునాథ్పల్లిలో 150
ఎకరాల్లో ఫాం ల్యాండ్
వినియోగదారుల స్థలాల్లో
చెట్ల పెంపకంతో ఆదాయం
విశాలమైన రహదారులు,
సకల సౌకర్యాలు..
చైర్మన్ జీ గోపిరాజు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
జీఆర్ గ్రూపు సంస్థ ఆధ్వర్యంలోని వెంచర్లలో స్థలాలు కొనగోలు చేసిన వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఆ సంస్థ చైర్మన్ జీ గోపిరాజు తెలిపారు. మంగళవారం ఆయన రఘునాథ్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంచర్ వివరాలు తెలిపారు. ఎన్‌హెచ్ 163కి అతి సమీపంలో జనగామ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో రఘునాథ్‌పల్లి మండలంలోని నిడికొండ, శ్రీరామచంద్రపురం సరిహద్దులో 150ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రజలకు అందుబాటు ధరల్లో ఫ్యాం లేఅవుట్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో కేవలం గుంట భూమిని రూ.లు 6లక్షలకే విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ వెంచర్లో వినియోగదారుల కోసం 50, 30ఫీట్ల
సువిశాల రోడ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వెంచర్లో భూమి కొన్న వారికి ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాలు అమలవుతాయని పేర్కొన్నారు. భూమి కొనుగోలు చేసిన వారికీ పట్టా పాసుపుస్తకంతో పాటుగా రైతుబీమా, రైతు బంధు తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. భూములు కొనుగోలు చేసిన వారి స్థలాల్లో సంస్థ ఆధ్వర్యంలో ఖర్జురా, తైవాన్, జామ తదితర మొక్కలను పెంచనున్నట్టు పేర్కొన్నారు.
ఫ్లాట్ కొనుగోలు దారులు వారాంతపు సెలవులను కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపేందుకు వీలుగా రిసార్ట్స్, కన్వెన్షన్ హాల్స్, ఆటస్థలం, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ థియేటర్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఫ్యాం ల్యాండ్ సమీపంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన యాదాద్రి పుణ్యక్షేత్రం, కొలనుపాక, వరంగల్లున్నాయని తెలిపారు.
అతితక్కువ సమయంలో ఈ ఫ్లాట్లలో గృహాలను నిర్మించు కోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. వినియోగదారుల కోసం లాభాపేక్ష లేకుండా ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాలను గుర్తించుకుని తమ ఫ్యాం ల్యాండ్ లో పెట్టుబడులు పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.