Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి అసువులు బాసిన గవిచర్ల గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బుట్టి సంతోష్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని మండలానికి చెందిన తోటి పోలీసు మిత్రులు ముందుకొచ్చారు. మండలంలోని గవిచర్ల, రామచంద్రాపురం, లోహిత, షాపురం గ్రామాలకు చెందిన తోటి కానిస్టేబులు మంగళవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తమ వంతుగా 36,500/- నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి, మిత్రులు మెరుగు అర్జున్, మచ్చ కోటేశ్వర్, గాలి ఎల్లస్వామి యాదవ్, ఆయా గ్రామాల పోలీసులు తదితరులు పాల్గొన్నారు.