Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
గ్రేటర్ వరంగల్‌లోని కార్పొ రేటర్లు అంద రూ పార్టీలకతీతంగా పనిచేసి నగరాన్ని మరింత అభివద్ధి చేయాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్ అన్నారు. గ్రేటర్ సమావేశ మంది రంలో మంగళ వారం బల్దియా మేయర్ గుండు సుధారాణి అధ్వర్యంలో కమిషనర్ ప్రావీణ్యం బడ్జెట్‌ను ప్రతిపాదించగా బీజేపీ కార్పొరేటర్లు ఆమోదించక నిరసన తెలిపారు. మిగతా కార్పొరేటర్లు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ నూతన చట్టాన్ని తీసుకురావడం, కొత్త ప్రణాళికలు సిద్ధం చేసి నూతన ప్రొసీజర్ ప్రకారంగా బడ్జెట్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ప్రొసీజర్ ప్రకారంగా ఫలితాలు పేపర్ పైన లేవని, పన్నుల విధింపులో గందరగోళ పరిస్థితి నెలకొన్నదన్నారు. స్లమ్ ప్రాంతాల్లో కొన్ని ప్రాపర్టీస్‌కు సుమారు 25లక్షల వరకు పెనాల్టీ వచ్చినట్టు తెలిపారు. ఈ అంశాన్ని ఒక యూనిఫాంగా ఎజెండాలో ప్రధాన అంశంగా తీసుకొని మున్సిపాలిటి నుంచి కౌన్సిల్ ద్వారా తీర్మానాన్ని ఆమోదించి సీడీఎంఏకు పంపాలన్నారు.
నగరాభివద్ది కోసం సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్‌లు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ మరింత అభివద్ధి చెందాలని అధిక నిధులను కేటాయిస్తు న్నారన్నారు. అందరూ కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా నగర అభివద్ధిపై దష్టి సారించాల్సిన అవసరం ఉంది. విలీన గ్రామాల అభివద్దికి 8కోట్లు ఎలా కేటాయించారో, అదే విధంగా తూర్పు నియోజక వర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చి నిధులు కేటాయించాలన్నారు. నగరంలో నిర్మితమవు తున్న స్ట్రామ్ వాటర్ డ్రోమ్ కు రూ.75 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.