Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వికలాంగులకు వంద శాతం సబ్సిడీతో ఉపకరణాల పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని, అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్లో ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సబిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికల్స్ కోసం 18 నుండి 50 ఏండ్ల లోపు వారు, 75శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉండి, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. బ్యాటరీ వీల్ చైర్స్ కోసం 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉండి, 12 ఏండ్లు పైబడిన వారు, కండరాల, కీళ్ల బలహీనత కలిగిన వారు అర్హులని తెలిపారు. ల్యాప్ టాప్స్ కోసం 75 శాతం వికలాంగత్వం ఉండి, డిగ్రీ పూర్తి చేసిన వారు, 40 శాతం వికలాంగత్వం ఉండి పీహెచ్డీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. 4జీ స్మార్ట్ ఫోన్ కోసం 51శాతం అంగవైకల్యం ఉండి చెవిటి వారు, 15 నుంచి 50 ఏళ్ల లోపు వారు ఇంటర్ చదివిన వారు అర్హులని తెలిపారు. డైసీ ప్లేయర్ కోసం 75 శాతం అంధత్వం కలిగి ఉండి ఇంటర్ చదివి, 15 ఏళ్లు పైబడిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల దివ్యాంగులు షషష .్స్త్రశీbఎఎర .షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ పోర్టల్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.