Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన నవతెలంగాణ-నర్సంపేట
భారత మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు పుట్టిన ఊరు లక్నెపెల్లిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లక్నెపెల్లి గ్రామంలో ఎమ్మెల్సీ సురబి వాణీదేవితో కలిసి ఈజీఎస్ నిధుల కింద రూ.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీవీ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సంకల్పించిందన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోతె కలమ్మ, సర్పంచ్ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఎల్లేరావు రజిత, పీఎస్సీఎస్ చైర్మన్ మురాల మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పరాచకపు శ్యామ్, టీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, నామాల సత్యనారాయణ, మచ్చిక నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.