Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
ఈ నెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యరాణీ అధ్యక్షతన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్స్ పోలియో ఇమ్మునైజేషన్, మిషన్ ఇంద్రధనుష్ 4.0 లపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేయాలని, అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ సిబ్బంది, గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ సెక్రటరీలు పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని వసతులు కల్పించాలని కోరారు.
మహిళా, శిశు సంక్షేమశాఖ నుంచి సూపర్వైజర్స్, ఆశాలు, ఏఎన్ఎం, అంగన్ వాడీ కేంద్రాలు, బల సాధనాలు, హౌమ్స్, దివ్యాంగుల వసతి గహాలు తదితర కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు వేయుటకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాల్పోస్టర్లు, సామాజిక మధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా||లలితా దేవి, అడిషనల్ డీఎంహెచ్ఓ డా||మధన్ మోహన్ రావు, ఎంజీఎం ఆర్ఎంఓ డా|| మురళీ, డీఐఓ డా|| గీతా లక్ష్మీ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సబితా, డా|| కష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.