Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
సీఎం కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మాటలతోనే కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి సాంబయ్య మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. భారత దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తయారు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. 57ఏండ్లకు పింఛన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భతి, ఆహారభద్రత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, ఉద్యోగాల భర్తీ ఇప్పటి వరకు చేపట్టిన పాపాన పోలేదని మండిపడ్డారు. ధరణి పేరుతో భూ అక్రమాలు జరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు మాదిరిగానే బిసి బంధు పథకం ప్రవేశపెట్టి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సాంబయ్య డిమాండ్ చేశారు.