Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేటలో జిల్లా కోర్టును ఏర్పాటునకు కృషి చేయాలని న్యాయవాదులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది దంపతులకు పుష్ప గుచ్ఛం అందజేసి పెండ్లీ రోజు శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము రమేష్ యాదవ్ నర్సంపేటలో జిల్లా కోర్టు అవశ్యకత, కోర్టులో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కొత్త జిల్లాలలో కోర్టులు ఏర్పాటు చేస్తున్నందున వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేటలో జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాలో ప్రభుత్వం పీవోసీఎస్‌వో కోర్టు ఏర్పాటు చేసిందన్నారు. సబ్ కోర్టుకు రెగ్యూలర్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు.
జూనియర్ సివిల్ రోర్టులో రెగ్యూలర్ పీపీని నియమించాలని పాత కోర్టు భవనం సందరీకరించాలన్నారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి, న్యాయశాఖ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చిలువేరు కిరణ్ కుమార్, కోర్టు ఏజీపీ గూళ్ల అశోక్ కుమార్, జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ మోటూరి రవి, సబ్ కోర్టు ఏపీపీ జన్ను మహేందర్, సీనియర్ న్యాయవాదులు కళ్లెపెల్లి సుధాకర్, కొడిదల సంజరు కమార్, పుట్టపాక రవి, చాగంటి సూరయ్య, కొంగరి రాజు, అంబాల సుదీర్, నాగుల రమేష్, సంసాని అశోక్, పొనగోటి అజరు, మిట్టగడుపుల మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.