Authorization
Mon March 10, 2025 02:25:46 am
నవతెలంగాణ-హసన్ పర్తి
66వ డివిజన్óలోని హసన్‌పర్తిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కార్పొరేటర్ శివకుమార్ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ లో ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వేసవిని దష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం కోసం బడ్జెట్ లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి సహకరించాలని మేయర్, కమీషనర్‌ను కోరారు.