Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ అన్నమనేని అప్పారావు
నవతెలంగాణ - వర్ధన్నపేట
కోవిడ్ బాధితుల కుటుంబాలలోని బాలలను సంరక్షించాలని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక రైతు వేదికలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, అజీజ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలో కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాల్లోని బాలలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోవిడ్‌తో కుటుంబ యజమానిని కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లలందరూ నిరాదరణకు గురయ్యారన్నారు. వారిని సంరక్షించడం మనందరి బాధ్యతన్నారు. కోవిడ్-19తో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఎఫ్ఎంఎం సంస్థ సహకారం అందించడం అభినందనీయ మన్నారు. అనంతరం హనుమకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీదేవి మాట్లాడుతూ.. ఐసీడీఎస్ సేవలను అంగన్వాడీ టీచర్ల సహకారంతో పొందాలని సూచించారు. జెడ్పీటీసీ ఎం భిక్షపతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం ద్వారా అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సహకారం గురించి. ప్రధానమంత్రి ఆర్థిక సహాయం గురించి వివరించారు. అర్హులైన వారు దరఖాస్తుచ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీకాంత్, కొమ్ముల నవీన్ , అమర్ తదితరులు పాల్గొన్నారు.