Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మున్సిపల్ కమిషనర్ (వీ ఆర్ఎస్) ముఖ్య దేవి సింగ్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పస్రా నాగారం, గోవిందరావుపేట, చల్వాయి, దుంపెళ్లిగూడెం పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటిరియల్స్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన సొంత జిల్లాలోని విద్యార్థులకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. అందరూ చదవాలి- అందరూ ఎదగాలి అనే దక్పథంతో విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గొంధి దివాకర్, ప్రధానో పాధ్యాయులు రాజేశ్వర్ రావు, కాంతరావు, కలీల్, జ్యోతి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మొగుళ్ళ భద్రయ్య, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య శ్రావణ్ నాయక్, దొంతి విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.