Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేటర్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
పల్స్ పోలియో, మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాలను విజయవంతం చేయాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ అన్నారు. బుధవారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వైద్య, సానిటేషన్ అధికారులకు పల్స్‌పోలియో, మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాల విజయవంతానికి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, బల్దియా తరపున సానిటేషన్, మెప్మా సిబ్బంది తమవంతు సహకారం అందిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా.గీతా లక్ష్మి మాట్లాడుతూ.. ఈ నెల 27న బూత్ స్థాయిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేండ్ల వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో వాక్సినేషన్ తీసుకొని వారిని గుర్తించి టీకాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ-ఎస్ఎంఓ డా.ప్రశాంత్, సూపర్ వైజర్ డా|| రమేష్, మెడికల్ ఆఫీసర్ డా|| రోషన్, సానిటరీ సూపర్వైజర్ సాంబయ్య పాల్గొన్నారు.