Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కాశీబుగ్గ
రైతులు తేమ, చెత్తా, చెదారం లేకుండా శుభ్రపరిచిన నాణ్యమైన మిర్చిని మార్కెట్‌కు తీసుకురావాలని వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ధిడ్డి భాగ్యలక్ష్మి కోరారు. బుధవారం మిర్చి యార్డులో ఆమె రైతులతో మాట్లాడారు. తేమశాతం ఉన్న మిర్చి రంగుమారి, కాయ నాణ్యత దెబ్బతిని ధర తగ్గుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలనుసరించి ధర ఉంటుందన్నారు. రైతుకు సరైన ధర లభించక పోతే పంట సరుకును కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేసుకుని రైతుబంధు రుణం పొందవచ్చునన్నారు. మిర్చి బస్తాలు తూకం వేసేటప్పుడు 40కిలోలకు మించి ఉండరాదన్నారు. రైతు దడ్వాయి సమక్షంలోనే. కాంట వేసుకోవాలని, లాట్ ఐడి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి బీవీ రాహుల్, పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.