Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని అభివద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించి సకాలంలో పూర్తి చేయించాలని ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ సూచించారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ పనుల తీరుపై వారికి అవగాహన కల్పించారు. నర్సరీల నిర్వహణ, రోడ్ల వెంబడి మొక్కలకు నీరు పట్టడం, డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త నిర్వహణ, వర్మి కంపోస్ట్ తయారీ, వైకుంఠ ధామాల నిర్మాణం, పన్నుల వసూలు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ పాక శ్రీనివాస్, ఏపీఓ సుశీల్‌కుమార్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.