Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
నియోజకవర్గంలోని గ్రేటర్ విలీన గ్రామాల అభివృద్దే లక్ష్యమని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. నియోజకవర్గ పరిధి గ్రేటర్ విలీన గ్రామాలలో రూ.8 కోట్లతో శ్మశాన వాటికలతో పాటు వివిద అభివృద్ది పనులను ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను ప్రారంభించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఇనుగాల రాజమ్మ, కుందూరు లక్ష్మిలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.1.20లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గ్రేటర్ 1వ డివిజన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు నుండి ముచ్చెర్ల వరకు రూ.8కోట్ల నిధులతో చేపట్టనున్న డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణానికి, ముచ్చెర్ల ప్రభుత్వ పాఠశాలలో రూ.35లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గుడికందుల రాకేష్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ.75వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునితరాజు, జడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, కార్పొరేటర్ వరంగంటి అరుణకుమారి, సర్పంచ్ కుందూరు సాంబరెడ్డి, ఎంపీటీసీ జట్టి మంజుల, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.