Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నవతెలంగాణ-సుబేదారి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలోపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్నత పాఠశాలు 74, ప్రాధమిక పాఠశాలు 84, ప్రాధమిక ఉన్నత పాఠశాలు 18 కలిపి మొత్తం 176 పాఠశాలలు ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కోసం నిరంతర నీటి సరఫరా, మరుగు దొడ్లు, విద్యుదీకరణ ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్య వేక్షిస్తానన్నారు. జిల్లాలోని 14మండలాల్లో ప్రత్యేక అధికారులను ఇప్పటికే నియమించామని, వారితో సమన్వయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం అమలుకు నిర్ణీత, ఆర్థిక పరిమితులకు లోబడిన పనులను పాఠశాల నిర్వహణ కమిటీల ద్వారా చేపట్టడానికి ఇద్దరు చురుకైన పూర్వ విద్యార్థులు సభ్యులుగా, సర్పంచ్, పాఠశాల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ప్రధానోపాధ్యాయులతో కమిటి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, ఆర్డీఓ వాసు చంద్ర, డీఈఓ రంగయ్య నాయుడు, డీఆర్డీఓ ఏ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, మన ఊరు మన బడి ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.