Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూములను పంచాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎస్సీ కమిటీ హాల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సీపీఐ ఉమ్మడి మండలాల కార్యదర్శులు బట్టు మల్లయ్య, మర్రిపల్లి అంకుస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ రజినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నెంబర్ 58, 59 ప్రకారం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు వెంటనే పట్టాలను ఇచ్చి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీసీయూ జిల్లా కార్యదర్శి పనస ప్రసాద్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మధ్యల ఎల్లేష్, నాయకులు మునగాల బిక్షపతి, కొట్టి ప్రభాకర్, చిలుక దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు. బుధశారం మండల కార్యదర్శి బుస్స రవీందర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వరంగల్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సత్యపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో అన్ని రంగాలలో పరిశ్రమలు స్థాపించాలని, అర్హులైన వారికి వితంతు, వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రమేష్, సరళ, రహెళ, కుమార్, రవి, దశ్ర, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-వేలేరు
నిరుపేదలకు భూపంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య అన్నారు. బుధవారం వేలేరు తహశీల్దార్ కార్యాలయంలో సీపీఐ మండల కార్యదర్శి బట్టు మల్లయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పనాస ప్రసాద్, మద్దెల ఎల్లేష్, బిక్షపతి, శంకర్, రమేష్, అజరు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఎల్కతుర్తి
స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సీపీఐ మండల కార్యదర్శి ఊటుకూరి రాములు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు నివేశన స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ధరణి వెబ్‌సైట్‌ను సరి చేయాలన్నారు. అనంతరం తహశీల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, వెంకటరమణ, నాయకులు, రాజ్‌కుమార్, రాజనర్సు, సదానందం, విజరు, జలపతి రెడ్డి, ఆనందం, రాజన్న, బొంత మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.