Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్‌హెచ్‌జీ మహిళలకు సహకారం అందిస్తా
సర్పంచ్ కుండే మల్లయ్య
నవతెలంగాణ - చెన్నరావుపేట
ఎస్‌హెచ్‌జీ మహిళలకు తన వంతు సహకారం అందిస్తానని చెన్నారావుపేట సర్పంచ్ కుండే మల్లయ్య అన్నారు. బుధవారం శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కల్లెపు శోభారాణి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాబార్డ్ సహకారంతో 30మంది ఎస్‌హెచ్‌సీ మహిళ సభ్యులకు శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ మహిళలకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జున్నుతల రాంరెడ్డి, ట్రైనర్లు సుందర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.