Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గ్రేటర్ 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్-1లో రూ.లు 25లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను బుధవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్లు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6కోట్ల నిధులతో డివిజన్‌ను అతికొద్ది కాలంలోనే అభివద్ధి పథంలో నడిపించిన యువ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్‌ను అభినందించారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు రమేష్, శేషగిరి, అశోక్, నవీన్, సతీష్, వెంకటేశ్వర్లు, శివ,కష్ణ, కల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ స్నేహాలత తదితరులు పాల్గొన్నారు.
58 డివిజన్లోని రాఘవేంద్ర నగర్ ఫేస్ టు, కేయూ ఎంప్లాయిస్ కాలనీలో బుధవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్, స్థానిక కార్పొరేటర్ లోహిత రాజు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ భాస్కర్, కార్పొరేటర్ రంజిత్ రావు, చిన్న నీలం సుహాస్, స్నేహిత్, కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.