Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మహిళలు ఎవరిమీద ఆధారపడకుండా స్వయం కృషితో ఎదగాలని ధర్మసాగర్ మహిళా పొదుపు సంఘం అధ్యక్షురాలు దాసరి రమాదేవి అన్నారు బుధవారం స్థానిక హనుమాన్ ఆలయం వద్ద ధర్మసాగర్ మహిళా పొదుపు సంఘం16వ వార్షికోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు నోముల కమలమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ గ్రామ ప్రజలు సమిష్టిగా 2006లో 598 మంది మహిళా సభ్యులతో సంఘాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. నేడు 780 సభ్యులతో 54 లక్షల రూపాయల పొదుపు నిల్వలతో ఈ సంఘం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రతి మహిళ చిన్న మొత్తాల పొదుపులతో లక్షల రూపాయలను పొదుపు చేసుకోవచ్చని సూచించారు. ఈ సంఘంలోని మహిళా సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణించినా ఎడల సంఘం తరఫున 45వేల రూపాయలు నామినికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు. వార్షికోత్సవ మహాసభకు విచ్చేసి విజయవంతం చేసిన మహిళల ందరికీ కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం గణకులు బచ్చు సుమలత, బొల్లం మమత, పాలకవర్గం సభ్యులు గోపగోని సమ్మక్క, గాజ కోమల, శామల రమ, నిమ్మ అరుణ, మొట్టే యామిని, గద్వాల లావణ్య, బెతి రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.