Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ బీ గోపి
నవతెలంగాణ-సంగెం
దళితబంధు లబ్దిదారులు సరైన యూనిట్లను ఎంచుకొని గ్రౌండింగ్ చేయించుకున్నట్లయితే ఫిబ్రవరి నెలాఖరు కల్లా వారి, వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని వరంగల్ కలెక్టర్ బీ గోపి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో సంగెం, గీసుగొండ మండల కేంద్రాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లబ్ధిదారులకు వెంటనే వారికి చెందిన యూనిట్ పేర్లతో అకౌంట్లను ఓపెన్ చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రాబోయే 28 తారీకు కల్లా లబ్డిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు. వారంందరూ వారికి కేటాయించిన యూనిట్లను నెలకొల్పి తద్వారా వారి కుటుంబాలను పోషించుకుని సద్వినియోగ పరుచు కోవాలన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అపోహలు వీడి ధైర్యంగా ఉండాలని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, దళిత బంధువు మండల ప్రత్యేక అధికారి బాలకష్ణ, సంగెం, గీసుగొండ ఎంపీడీవోలు మల్లేశం, రమేష్, తహశీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.