Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమేనని స్థానిక ఎస్ఐ రాధిక అన్నారు. వెంకటాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు సుమలత బదిలీపై వెళ్తుండంతో బుధవారం ప్రధానోపాధ్యాయులు జనగాం బాబురావు ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులే కారణమన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు సుమలతను ఘనంగా సన్మానించారు. అలాగే పాఠశాలకు నూతనంగా విచ్చేసిన పోలు లావణ్య, ఆడిచెర్ల రాజయ్యలకు ఎం పీపీఎస్ ఉపాధ్యాయులు సరేందర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ పద్మాకర్ రెడ్డి, ఓదెల వేణుగోపాల్, నూనె ప్రవీణ, కొంపెల్లి జమున, హై స్కూల్ సిబ్బంది శ్రీనివాస్, సత్యం, మహేష్, చేరాలు తదితరులు పాల్గొన్నారు.