Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
రాష్ట్ర ప్రభుత్వం దళిత సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మాలలకు అవకాశం కల్పించాలని మాల మహానాడు మండలాధ్యక్షులు ఒంటెల కర్ణాకర్ అధికారులను కోరారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బుధవారం ఎంపీడీఓ ఆమంచ కృష్ణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో పది దళిత బంధు యూనిట్స్ మంజూరు చేశారని, అందులో ఒకే వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ మాలలకు కేటాయించకపోవడం దారుణమన్నారు. మాలలు దళితులు కారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందించి దళిత బంధు జాబితాలో మాలలకు చోటు కల్పిస్తూ తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, సమ్మయ్య, పవన్ కుమార్, బీఎస్ఎస్ నాయకులు సుమన్, ఏబీఎస్ఎఫ్ నాయకులు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.