Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినరు భాస్కర్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని శుక్రవారం కాజీపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యం హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 62, 63 డివిజన్ల పరిధిలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతునట్టు చెప్పారు. ముఖాముఖి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. సీఎం ఆలోచన విధానంతో రాష్ట్రం అభివద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. 47, 62, 63వ డివిజన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి దాదాపు 45 దరఖాస్తులు వచ్చినట్టు, ఈ సమస్యల పరిష్కారానికి అధికారుల బందం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంకు నర్సింగ్ రావు, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజలి, ఎలకంటి రాములు పలు విభాగాల అధికారులు నాయకులు పాల్గొన్నారు.