Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఖానాపురం
మండలకేంద్రంలో కాంగ్రెస్ మండల ఇన్చార్జి ఓర్సు తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ సభ్యత్వ నమోదులో ఖానాపూర్ మండలాన్ని నర్సంపేట నియోజకవర్గంలో మొదటి స్థానములో ఉంచేవిధంగా నాయకుల, బూత్ ఎన్రోలర్లు సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి, మండలాధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ రావు, జిల్లా నాయకులు శాఖమూరి హరిబాబు, యడ్ల భిక్షంరెడ్డి, ఎన్రోలర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని సాగర్ రావు, వార్డు సభ్యుడు కందుల సాంబయ్య, ఎలగందుల చేరాలు, గొర్రె నవీన్ తదితరులు పాల్గొన్నారు.