Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని రామతీర్థం గ్రామంలోని నర్సరీని శుక్రవారం ఎంపీఓ కూచన ప్రకాష్ సందర్శించి వెంటనే షెడ్డు నెట్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. నర్సరీలలో పెద్దగా పెరిగిన మొక్కలను షిఫ్టింగ్, గ్రేడింగ్ చేయాలని, మొక్కలకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో నీటిని అందించాలన్నారు. జూన్ నెలలో హరితహారంకు మొక్కల పంపిణీకి సన్నద్ధం కావాలని మొక్కల పంపిణీకి ముందే ప్రణాళిక తయారు చేసుకుని సిద్ధంగా ఉండి.. ప్రభుత్వం ఆదేశించగానే పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఖాళీ బ్యాగులో నారు నాటి మొక్కలను పెంచాలని కార్యదర్శులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.