Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పరీక్షల పేరిట అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు శివరాత్రి అనిల్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రశాంత్ మాట్లాడారు. జిల్లాలోని ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మోసగిస్తున్నాయన్నారు. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని షరత్లను విధిస్తూ విద్యార్థులను భయోందళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో విద్యను వ్యాపార పరం చేస్తూ ఇష్టానుసారంగా ఫీజులను వసూళ్లను చేస్తూ దోపిడి చేస్తున్నాయన్నారు. విద్యా శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం బాధ్యతారహిత్యమని విమర్శించారు. వెంటనే ఫీజుల దోపిడి అరికట్టే చర్యలు చేపట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఎస్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, నాయకులు విజరు, నరేష్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.