Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
రాష్ట్ర ప్రభుత్వం అసైండ్ భూములను క్రమబద్దీకరించడానికి జారీ చేసిన జివో 58, 59ను అమలు చేయడం పట్ల హర్షం వెలుబుచ్చుతూ టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ చేశారు. శుక్రవారం అంబేద్కర్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు మీదిగా తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య శ్రేణీ నాయకులు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టణంలో నెలకొన్న అసైండ్ భూముల ప్రత్యేక పరిస్థితిపై కిందటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తూ చర్చించారని తెలిపారు. పట్టణంలోని వల్లబ్నగర్, మల్లంపెల్లి రోడ్డు, స్నేహ నగర్, సంజరు నగర్, నెక్కొండ రోడ్డు తదితర ప్రాంతాల్లోని 111, 702 వంటి పలు సర్వే నెంబర్లలో ఎన్నో యేండ్ల నుంచి పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొని, గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారన్నారు. పట్టాలు లేక ఎలాంటి హక్కులు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. పేదల చేతిల్లోని భూములను క్రమబద్ధీకరించి హక్కులను కల్పించాలని కోరగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి క్రమబద్దీకరణ గడువును పొడిగిస్తూ జివో 14ను విడుదల చేశారన్నారు. నర్సంపేట ప్రజానీకానికి ఈ జివో ఎంతో ఉపశమనం కలిగించనున్నందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసైండ్ భూములను క్రమబద్దీకరణ చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పట్టణ ప్రజల తరుపున కృతజ్ఞతలు చెప్పారు. అర్హులైన వారందరు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకొన్నట్లయితే భూములపై ప్రభుత్వం క్రమబద్దీకరణ పట్టాలను అందస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైఎస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల యాదగిరి, పెరుమండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.