Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం (టౌన్)
మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో శుక్రవారం కరోనా బాధితురాలు ప్రసవించింది. వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలం వెంగళరావు గ్రామానికి చెందిన ఆట్టం సమ్మక్క పురిటి నొప్పులతో బాధపడుతూ స్థానిక సామాజిక ఆస్పత్రికి చేరుకుంది. కాగా రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు కరోనా ఉందని నిర్ధారించారు. అయినా భయపడని వైద్యులు మధురిమ, దిలీప్ కుమార్లు పలు జాగ్రత్తలు పాటిస్తూ శస్త్ర చికిత్స ద్వారా మహిళకు సుఖ ప్రసవం చేశారు. దీంతో వారిని పలువురు ప్రశంసించారు. దీనిలో వైద్య సిబ్బంది కష్ణవేణి, కోటి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.