Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలో ఇటీవల జరిగిన మైనర్ల వివాహాలపై అధికారులు ఎస్సై కిషోర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఎస్సై తో మాట్లాడారు. మైనర్లకు వివాహం చేసినట్లయితే చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రతిఒక్కరూ కషి చేయాలన్నారు. మైనర్లకు వివాహం చేసినట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ చేసినట్లయితే సకాలంలో అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీహెచ్ శ్రీదేవి, జిల్లా బాలల సంరక్షణ అధికారి జీ మహేందర్ రెడ్డి, సెక్టార్ సూపర్వైజర్ పీ ఈశ్వరీ, ప్రొటెక్షన్ ఆఫీసర్ డీ రాజు, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.