Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయపర్తి
అంబులెన్స్ (108) సిబ్బంది సేవలు మరువలేనివని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణలు అన్నారు. శుక్రవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అమూల్య గ్యాస్ ఏజెన్సీ (హెచ్పీి) డీలర్ ఐత సుధాకర్ అంబులెన్స్ సిబ్బందికి వంట గ్యాస్ సామగ్రి అందజేశారు. తదుపరి సేఫ్టీ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ జరిగితే మొదటా గాలి ప్రసరించే విధంగా కిటికీలు, తలపులు తెరచి ఉంచాలనాన్రు. తద్వారా గ్యాస్ బయటకు వెళ్లి ప్రమాదం సంభవించకుండా ఉంటుందని తెలిపారు. ఆ లీకేజీ వల్ల మంటలు సంభవిస్తే జనపనార బస్తాలు, గొంగళితో కప్పేస్తే మంటలు ఆగిపోతాయని వివరించారు. వినియోగదారులు గ్యాస్ వాడకంలో ఎంలాటి సమస్యలు తలెత్తిన తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేశారని, వారి సేవలు అమూల్యమైనవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐత రాంచందర్, అంబులెన్స్ సిబ్బంది రాజు, అనిల్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అనిల్ కుమార్, పెదగొని సందీప్, తదితరులు పాల్గొన్నారు.