Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
రెవెన్యూ, ఇరిగేషన్ భూసేకరణకు సంబంధించిన కోర్టు కేసులు పరిష్కారం నిమిత్తం ఈ నెలాఖరు వరకు కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో భూసేకరణకు సంబంధించి ఇరిగేషన్ రెవెన్యూ పరంగా ఉన్న కోర్టు కేసులను పరిష్కరించే దిశగా అధికారులు కౌంటర్ దాఖలు వేయాలని, కో ఆర్డినేషన్ చేసుకోవాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెవీ గణేష్, డీఆర్ఓ కెే రమాదేవి, ఇరిగేషన్ సిఈ విజయ భాస్కర్ రావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ మోహన్ రావు, ఈ ఈ వెంకట కష్ణారావు, డీఈ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.