Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
ఆదర్శ వివాహాలతో సమాజంలో మార్పు వస్తుందని ములుగు, భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు, శుక్రవారం వివాహ సర్టిఫికేట్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన రాజు, రాధిక దంపతులను ఆమె ఆశీర్వదించారు. వికలాంగుడు రాజు, నిరుపేద కుటుంబానికి చెందిన రాధికలు ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయ మన్నారు. నూతన జంగకు తస్లీమా వివాహ నమోదు పత్రంతో పాటు నూతన వస్త్రాలు బహూకరించారు. ఆదర్శ వివాహాలతో సమాజంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ తారతమ్యాలు సమసిపోతాయన్నారు.